పడక గదిలో భర్త అసహజ లైంగిక చర్యకు పాల్పడ్డాడనీ...
ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. పడక గదిలో తన భర్త పశువులా ప్రవర్తించడాన్ని జీర్ణించుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది. బెంగుళూరు నగరంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. పడక గదిలో తన భర్త పశువులా ప్రవర్తించడాన్ని జీర్ణించుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది. బెంగుళూరు నగరంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
బెంగుళూరు నగరానికి చెందిన 25 ఏళ్ల మహిళ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఈమెకు భర్త, ఆరేళ్ల వయసున్న కుమార్తె కూడా ఉంది. అయితే, పడక గదిలో భర్త పెట్టే లైంగిక పైశాచికత్వాన్ని భరించలేక తన కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
ఈనేపథ్యంలో తన కుమార్తెను చూసేందుకు అత్తారింటికి వచ్చిన భర్త.. భార్యను పడక గదిలోకి తీసుకెళ్లి మళ్లీ అసహజ లైంగిక చర్యకు పాల్పడ్డాడు. పైగా, అందుకు అంగీకరించేందుకు మారాం చేసిన భార్యను చితకబాదాడు. దీంతో తీవ్ర మనస్తాపానికిగురైన ఆ మహిళా టీచర్... నరాలు కోసుకొని, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది.
ఈ విషయాన్ని గమనించిన ఆమె చెల్లి బాధితురాలిని ఆసుపత్రికి తరలించింది. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోంది. భర్తపై భార్య ఫిర్యాదు మేరకు భార్య అనుమతి లేకుండా భర్త బలవంతం చేశాడని పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 బి, 498 ఏ కింద కేసు నమోదు చేశారు.