గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2024 (22:20 IST)

చెన్నైని ముంచేసిన వర్షాలు.. బెంగళూరులోనూ కుంభవృష్టి (video)

Tech Park
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడును వర్షాలు ముంచెత్తుతున్నాయి. వీటి ప్రభావంతో తమిళనాడుతో పాటు బెంగళూరులోనూ రాబోయే 48 గంటల్లో భారీ వర్షపాతం కురిసే అవకాశం వుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
 
అక్టోబర్ 15-17 మధ్య కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు బెంగళూరులో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి నగరంలోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు బెంగళూరు అర్బన్ జిల్లా కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, ఐటీఐలు, ఇతర విద్యాసంస్థలకు సెలవులు ఉండవని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
పిల్లల భద్రతతో పాటు వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలియజేసారు. విద్యార్థులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు, వార్డెన్ సిబ్బంది, విద్యాశాఖ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..