మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (16:02 IST)

ప్రేయసి కోసం చీర కట్టుకున్నాడు.. పెళ్లికి వెళ్లాడు.. చివరికి దొరికిపోయాడు..

ఓ యువకుడు ప్రేయసి కోసం ఓ మ‌హిళ మాదిరి చీర ధ‌రించాడు. గాజులు వేసుకున్నాడు. విగ్ పెట్టుకుని సుంద‌రంగా ముస్తాబ‌య్యాడు. ఇక త‌న ఇద్ద‌రు స్నేహితుల సాయంతో ప్రియురాలి వివాహం జ‌రుగుతున్న పెళ్లింటికి చేరుకున్నాడు. 
 
కానీ చీర ధ‌రించిన అత‌న్ని చూసిన వెంట‌నే యువ‌తి కుటుంబ స‌భ్యుల‌కు అనుమానం వ‌చ్చింది. దీంతో అత‌న్ని అడ్డ‌గించారు. వెంట వ‌చ్చిన ఇద్ద‌రు స్నేహితులు అక్క‌డి నుంచి జంప్ అయ్యారు. ప్రియురాలిని క‌ల‌వాల‌నుకున్న అత‌డి ఆశ‌లు ఆవిరైపోయాయి. యువ‌తి కుటుంబ స‌భ్యులు అత‌న్ని పోలీసుల‌కు అప్ప‌గించారు.
 
వివరాల్లోకి వెళితే.. భ‌దోయి ప్రాంతానికి చెందిన ఓ యువ‌తీయువ‌కుడు ప్రేమించుకున్నాడు. వీరి ప్రేమ వ్య‌వ‌హారం ఇంట్లో తెలిసింది. దీంతో వీరిద్ద‌రిని విడదీసి, స‌ద‌రు యువ‌తికి మ‌రొక‌రితో పెళ్లి నిశ్చ‌యించారు. ప్రియురాలు త‌న‌కు ద‌క్క‌లేద‌నే బాధ‌లో మునిగిపోయాడు. 
 
ఆమె వివాహం తేదీ రానే వ‌చ్చింది. ఇక ఎలాగైనా త‌న ప్రియురాలి పెళ్లికి వెళ్లాల‌నుకున్నాడు. వెళ్తే గుర్తు ప‌డితే క‌ష్టం. కొట్టి చంపుతారు అని భావించిన ఆ యువ‌కుడు అతి తెలివిగా ఆలోచించాడు. ఈ క్ర‌మంలో ప్రియురాలికి వివాహానికి ప్రియుడు చీర ధ‌రించి వెళ్లి, అడ్డంగా దొరికిపోయాడు.