శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (15:12 IST)

వడ్డేపల్లి కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో లావణ్య విత్ లవ్ బాయ్స్

Lavanya with Love Boys
'ఎక్కడికి వెళ్తుందో మనసు' అనంతరం ప్రముఖ గీత రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన స్వచ్ఛమైన ప్రేమకథ 'లావణ్య విత్ లవ్ బాయ్స్'. పావని టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో యోధ-కిరణ్-సాంబ హీరోలు. పరుచూరి గోపాలకృష్ణ, కాశీ విశ్వనాధ్, హేమసుందర్, వైభవ్, యోగి, భవాని ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ వినోదభరిత ప్రేమకథాచిత్రాన్ని 'రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్' పతాకంపై శరత్ చెట్టి (యూఎస్ఏ) సమర్పణలో శ్రీమతి రాజ్యలక్ష్మి.సి-నర్సింలు పటేల్ చెట్టి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 6 న ప్రముఖ ఓటిటి ఊర్వశి ద్వారా విడుదల కానుంది.
 
డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ, స్వచ్ఛమైన ప్రేమను ఎలా పొందింది?" అనే అంశాన్ని అత్యంత వినోదాత్మకంగా అందరి హృదయాలకు హత్తుకునేలా రూపొందిన చిత్రమిది. మనసులను మైమరపించే మాటలు-పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: రమణ తోట, సంగీతం: యశోకృష్ణ, సమర్పణ: శరత్ చెట్టి (యూఎస్ఏ), నిర్మాతలు: శ్రీమతి రాజ్యలక్ష్మి.సి-నర్సింలు పటేల్ చెట్టి, కథ-మాటలు-పాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, విడుదల: ఊర్వశి ఓటిటి.