పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం
బీహార్‌లో దారుణం జరిగింది. పరీక్ష రాసేందుకు వెళ్లిన యువతి కామాంధుల చేతిలో నలిగిపోయింది. పరీక్షకు హాజరైన ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భోద్ గయలోని పరేడ్ గ్రౌండ్‌లో గురువారం హోంగార్డు పరీక్ష నిర్వహించారు.
ఈ పరీక్షకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి హాజరయ్యింది. దేహదారుఢ్య పరీక్ష చేసే సమయంలో ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో అక్కడున్న అధికారులు అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు.
ఆ యువతిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది.