సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 12 జులై 2023 (13:05 IST)

బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల వెల్లడి : తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి

bjp flags
రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన నేత లేకపోవడం గమనార్హం. బీజేపీ ప్రకటించిన మూడు స్థానాల్లో గుజరాత్ నుంచి ముగ్గురు, వెస్ట్ బెంగాల్ నుంచి ఒకరు ఉన్నారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచి అనంత మహరాజ్, గుజరాత్ నుంచి బాబూభాయ్ జేసంగ్ భాయ్ దేశాయ్, కే శ్రీదేవ్ సిన్హ్ జాలాకు అవకాశం కల్పించారు. 
 
ఈ నెల 24వ తేదీన 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వెస్ట్ బెంగాల్‌లో ఆరు, గుజరాత్‌లో మూడు, గోవాలో ఒకటి స్థానం చొప్పున ఎన్నికలు జరుగుతాయి. భారత్ విదేశాంగ శాఖామంత్రిగా ఉన్న జైశంకర్‌ను ఇప్పటికి గుజరాత్ నుంచి బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. అయితే, బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు.