గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మే 2023 (19:39 IST)

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ.. ChatGPT సమాధానాలు రాబట్టాడు..

ChatGPT
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం సంచలనానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఏడుగురిపై అభియోగాలు నమోదు చేశారు.
 
ఏడుగురి నిందితుల్లో ఒకరు కృత్రిమ మేధస్సుకు చెందిన ఏఐ సహాయంతో నడిచే ChatGPT సేవను ఉపయోగించి ప్రశ్నలకు సమాధానాలు పొందిన సంఘటన వెలుగులోకి వచ్చింది.  
 
ఏఐ ద్వారా ఓ నిందితుడు ఈ ప్రశ్నలకు సమాధానం పొందినట్లు దర్యాప్తులో తేలింది. ఆ సమాధానాలను బ్లూటూత్ ఇయర్‌ఫోన్ ద్వారా ఇతర అభ్యర్థులకు తెలియజేసినట్లు సమాచారం. 
 
ChatGPTవంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక పరీక్షలో అవకతవకలు జరగడం దేశంలో ఇదే మొదటిసారి. ఈ కేసులో నిందితుడైన రమేష్ అనే వ్యక్తిని విచారణ బృందం విచారించింది. రమేష్ పరీక్ష ప్రారంభానికి పది నిమిషాల ముందు ప్రశ్నపత్రాన్ని తీసుకుని, ChatGPT సర్వీస్ ద్వారా సమాధానాలు రాబట్టాడు.