గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (08:51 IST)

దేశంలో ముస్లింలను అణిచివేసేందుకు బీజేపీ కుట్ర: అగ్నివేష్‌

దేశంలో ముస్లింలను అణిచివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సామాజిక వేత్త అగ్నివేష్‌ ధ్వజమెత్తారు. విజయవాడలో సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా ప్రజాగర్జన సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందు, ముస్లింల మధ్య బీజేపీ విబేధాలు సృష్టిస్తోందని ఆరోపించారు. గాడ్సే వారసులమని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రుజువు చేసుకున్నాయని అగ్నివేష్‌ చెప్పారు. ఈ సభలో స్వామి అగ్నివేష్‌, సీపీఐ నేత రామకృష్ణ, కేశినేని, గద్దె రామ్మోహన్‌ హాజరైనారు.
 
రాష్ట్రపతి ప్రసంగంలో సీఏఏ ప్రస్తావన
పార్లమెంటు బడ్జెట్​ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రసంగిస్తూ సీఏఏ అంశాన్ని ప్రస్తావించగానే సభ ఒక్కసారిగా దద్దరిల్లింది. విపక్షాల నినాదాలతో సభ మార్మోగింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పౌరసత్వ చట్టాన్ని ప్రస్తావించగానే విపక్ష సభ్యులు తీవ్రంగా స్పందించారు. నినాదాలతో సభను హోరెత్తిస్తూ కాసేపు గందరగోళం సృష్టించారు. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు రాష్ట్రపతి.