సంబంధిత వార్తలు
- అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్లో దోపిడీ
- Good Bye India, విమాన ప్రమాదానికి ముందు బ్రిటిష్ పౌరుల సెల్ఫీ వీడియో (video)
- పక్షి ఢీకొట్టడం వల్లే విమాన ప్రమాదమా? పైలెట్ నుంచి మే డే కాల్!
- ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం : గుజరాత్ మాజీ సీఎం మృతి?
- ఎయిరిండియా విమాన ప్రమాదంలో 110 మంది మృత్యువాత? మాజీ సీఎం కూడా??? (Video)
కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది ఉన్నారు. వీరిలో 35 నుంచి 40 మంది మినహా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అయితే, ఈ విమానంలో లోపం ఉన్నట్టు ముందే ఓ విమాన ప్రయాణికుడు సందేహం వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని తన ఎక్స్ ఖాతా వేదికగా ఎయిరిండియా సంస్థకు సమాచారం కూడా చేరవేశాడు.
అయితే, ఈ విమానం న్యూఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదుగా లండన్‌కు చేరుకోవాల్సివుంది. ఆకాష్ అనే వ్యక్తి న్యూఢిల్లీలో ఈ విమానం ఎక్కాడు. అతడు అహ్మాదాబాద్‌లో దిగిపోయాడు. ఆ క్రమంలో ఈ విమానంలో లోపం ఉందంటూ అతడు ముందే ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు.
మరోవైపు, యేడాది వ్యవధిలో ఇదే విమానంలో రెండుసార్లు సాంకేతిక సమస్య తలెత్తినట్టు సమాచారం. 2024 జూన్ 6 తేదీన, డిసెంబరు నెలలో ఈ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సాంకేతిక సమస్యపై ఎయిరిండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేఖ కూడా రాసింది. అయితే ఈ లేఖను ఎయిరిండియా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరించింది. చివరగా మూడోసారి అంటే జూన్ 12వ తేదీ గురువారం ఈ ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. పైగా ఈ విమానం చాలాకాలం నాటిగా గుర్తించారు.
#DINAMANI | விபத்துக்குள்ளான விமானத்தில் தில்லியிலிருந்து ஆமதாபாத்வரை பயணித்தவரின் Xதளப் பதிவு!#planecrash #airindia #gujaratplanecrash pic.twitter.com/3T8FlPm7id
— தினமணி (@DinamaniDaily) June 12, 2025
తర్వాతి కథనం
