ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (09:23 IST)

కల్యాణ్ మండపం నుంచి వధువు పరార్.. ప్రియుడితో పారిపోయిందా?

అచ్చం సినిమా తరహాలో ఓ సన్నివేశం చోటుచేసుకుంది. కొద్ది సేపట్లో పెళ్లనగా ఓ నవ వధువు ప్రియుడితో పరారైంది. ఈ ఘటన కర్ణాటక ధార్వాడ నగరంలో చోటుచేసుకుంది. అప్పటివరకు ఎంతో సందడిగా కనిపించిన వివాహ వేదిక నిశ్శబ్

అచ్చం సినిమా తరహాలో ఓ సన్నివేశం చోటుచేసుకుంది. కొద్ది సేపట్లో పెళ్లనగా ఓ నవ వధువు ప్రియుడితో పరారైంది. ఈ ఘటన కర్ణాటక ధార్వాడ నగరంలో చోటుచేసుకుంది. అప్పటివరకు ఎంతో సందడిగా కనిపించిన వివాహ వేదిక నిశ్శబ్ధంగా తయారైంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక ధార్వాడ నగరంలోని దైవజ్ఞ కల్యాణ మంటపం ముస్తాబైంది. రిసెప్షన్ కోసం బంధువులు.. అతిథులు వచ్చారు. ముహూర్త గడియలు దగ్గరపడింది. 
 
వధువును తీసుకురావాల్సిందిగా పెద్దలు పురమాయించారు. చూసేందుకు వెళ్లిన వారు.. వధువు అక్కడ లేకపోవడం అవాక్కయ్యారు. పెళ్లి కుమార్తె కనిపించలేకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. మండపం అంతా గాలించారు. కానీ వధువు కనిపించలేదు. ఆరాతీయగా తన ప్రియుడితో ఆమె పరారైనట్లు తేలింది. తమ కుమార్తె కనిపించలేందంటూ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.