మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (13:15 IST)

కేంద్ర బడ్జెట్- జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి రూ.30,757 కోట్లు.. కీలకాంశాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో భాగంగా జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి రూ.30,757 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో దాల్ సరస్సులోని విరబూసిన కమలం లాంటిదని నిర్మల చెప్పడంతో సభ్యులు కరతాళ ధ్వనులు చేశారు. మన దేశం జమ్మూకశ్మీర్‌లోని షాలిమార్‌ తోట లాగా వికసిస్తుందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్థావిస్తూ కాశ్మీరీ పద్యాన్ని వల్లె వేశారు. 
 
''మన దేశం షాలిమార్ తోటలాగా వికసిస్తుంది... మన దేశం దాల్ సరస్సులోని విరబూసిన కమలంలాంటిది, మన దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం లాంటిది... మన దేశం ప్రపంచంలోనే అందరి కంటే మనోహరమైంది'' అని నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కేంద్రమంత్రి నిర్మలా కశ్మీరీ పద్యానికి పార్లమెంటు సభ్యులు బల్లలు చరచి ప్రశంసించారు.
 
ఇకపోతే.. బడ్జెట్‌లో బ్యాంకు డిపాజిట్లపై బీమా రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచారు. విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తారని.. 2024కు మరో వంద విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. భారత నెట్‌ ద్వారా ప్రతి ఇంటికి ఫైబర్‌ నెట్‌ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. కొత్త అవకాశాలను అందుకునేందుకు డేటా సెంటర్‌ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. పోటీని తట్టుకుని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు డేటా సెంటర్లు ఉపయోగపడతాయని నిర్మల స్పష్టం చేశారు. 
 
* నదీతీరాల్లో ఆర్థికాభివృద్ధి  
* ప్రతి గ్రామ పంచాయతీకి భారత్‌నెట్‌తో అనుసంధానం 
* రైలు మార్గాల ఇరు పక్కల సోలార్ కేంద్రాల ఏర్పాటు
* నగరాల్లో కాలుష్య నియంత్రణకు రూ.4.400 కోట్లు 
* టైక్స్‌టైల్ రంగానికి రూ. 1,480 కోట్ల కేటాయింపు.
* పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహానికి రూ. 27,300 కోట్లు.
 
* ప్రతి ఇంటి గడపకూ విద్యుత్ తీసుకెళ్లి అతిపెద్ద విజయం సాధించాం.
* నదీతీరాల వెంబడి అభివృద్ధి కార్యకలాపాలకు ప్రోత్సాహం.
* బెంగళూరుకు రూ. 18,600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్ రైల్వే పథకం.
* ఈ ప్రాజెక్టుకు 20 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర నిధులు, 60 శాతం నిధుల సమీకరణ.
 
* రవాణా, మౌలిక వసతుల అభివృద్ధికి రూ. 1.70 లక్షల కోట్లు.
* రూ. 1.30 లక్షల కోట్ల అంచనా వ్యయంతో కొత్త ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు.
* 11 వేల కిలోమీటర్ల మేరకు రైల్వే మార్గాల విద్యుద్దీకరణ.
 
* రైల్వే ట్రాక్‌ల వెంబడి సోలార్ విద్యుత్ కేంద్రాలు.
* ముంబై - అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్వే లైన్ నిర్మాణం వేగవంతం.
* ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 150 నూతన రైళ్లు.
* 2023 నాటికి చెన్నై - ముంబై, చెన్నై - బెంగళూరు ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణం.
* భారత్ నెట్ పథకానికి రూ. 6 వేల కోట్లు.
 
* వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా విద్యుత్ ప్రీ పెయిడ్ మీటర్లు.
* దేశవ్యాప్తంగా డేటా సెంటర్ పార్కుల ఏర్పాటుకు నిర్ణయం.
* యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం.
 
* ఉద్యోగాల కల్పనకు ముందుకు వచ్చే స్థాయికి తేవడమే లక్ష్యం.
* పెట్టుబడి పెట్టే ముందే తగు శిక్షణ, అవకాశాలపై అవగాహన కల్పించే కేంద్రాల ఏర్పాటు.
* నూతన పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు ప్రత్యేక విభాగం.
 
* ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతమిచ్చేలా కొత్త స్కీమ్ లు.
* మొబైల్స్, తయారీ, సెమీ కండక్టర్ పరిశ్రమలపై త్వరలోనే నూతన విధివిధానాల ఖరారు.
* రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్తగా 5 ఆకర్షణీయ నగరాలు.
* జౌళి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక విభాగం.
 
* జాతీయ జౌళి సాంకేతిక మిషన్ ద్వారా కొత్త పథకం.
* చిన్న తరహా ఎగుమతిదారులకు రక్షణగా నిర్విక్ పేరిట సరికొత్త బీమా స్కీమ్.
* ప్రతి జిల్లానూ ఓ ఎక్స్ పోర్ట్ హబ్ గా మార్చాలన్నదే ప్రభుత్వ ఆశయం.
* మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యలక్ష్మీ పథకం అమలు.
* అంతర్జాతీయ వాణిజ్య ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక మండళ్ల ఏర్పాటు.
 
* త్వరలోనే జాతీయ సరకు రవాణా విధానం.
* రెండు వేల కిలోమీటర్ల ల్యాండ్ టూ పోర్ట్ రూట్ కు రహదారుల అనుసంధానం.
* రూ. 1.30 లక్షల కోట్ల అంచనా వ్యయంతో కొత్త ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు.
* ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీ విభాగాల్లో మరిన్ని సంస్కరణలు.
* లక్ష గ్రామాలకు ఓఎఫ్సీ ద్వారా డిజిటల్ కనెక్టివిటీ.
 
* జాతీయ గ్రిడ్ తో లక్ష గ్రామాల అనుసంధానం.
* అంగన్వాడీలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, పోలీస్ స్టేషన్లకు డిజిటల్ అనుసంధానం.
* బేటీ బచావో - బేటీ పఢావో గొప్ప విజయం సాధించింది.
* పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ ముందున్న బాలికలు.
* బాలలకు పౌష్టికాహారం అందించేందుకు మరిన్ని నిధులు.
* 9 వేల కిలోమీటర్ల పొడవున ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు.
* పాత ధర్మల్ కేంద్రాలు తమ కర్బన ఉద్గారాలను తగ్గించుకోకుంటే చర్యలు.
* జాతీయ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం.
 
* అవినీతి రహిత పాలనను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం.
* వ్యాపార వర్గాల్లో నమ్మకం పెంచేలా పన్ను చెల్లింపు చార్టర్.
* పన్ను చెల్లింపుదారులపై వేధింపులకు స్వస్తి చెప్పే విధానం.
* పన్ను చెల్లించని వారిపై ఉండే క్రిమినల్ శిక్షలు ఇక సివిల్ విధానానికి మార్చేందుకు చర్యలు.
* సివిల్ విధానంలో మార్పులకు త్వరలోనే చట్ట సవరణ.
 
* నాన్ గెజిటెడ్ పోస్టులకు జాతీయ స్థాయిలో రిక్రూట్ మెంట్ ఏజెన్సీ.
* సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆర్థిక స్వావలంబన దిశగా చర్యలు.
* నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం.
* మేధోహక్కుల పరిరక్షణకు పెద్దపీట.
* వారసత్వ పరిరక్షణకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్ ఏర్పాటు.
* దేశవ్యాప్తంగా 5 పురావస్తు కేంద్రాల ఆధునికీకరణ, అభివృద్ధి.
 * ఝార్ఖండ్ లోని రాంచీలో పురావస్తు గిరిజన ప్రదర్శనశాల.
* సఫాయీ కర్మచారి విధానానికి స్వస్తి.
* వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ పర్యావరణ పరిరక్షణ.
 
* పారిస్ ఒప్పందానికి అనుగుణంగా కాలుష్య నియంత్రణా చర్యలు.
* పౌష్టికాహారానికి రూ. 35,600 వేల కోట్లు.
* మహిళా సంక్షేమానికి రూ. 28,600 కోట్లు.
* ఎస్టీల అభివృద్ధికి రూ. 53,700 కోట్లు.
* 2024 నాటికి దేశంలో కొత్తగా 100 ఎయిర్ పోర్టులు.