బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (08:14 IST)

ముంబైలో భవనం కూలి 8 మంది మృతి

ముంబయిలో ఘోర ప్రమాదం జరిగింది. భివాండిలో సోమవారం ఉదయం మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు.

శిధిలాల కింద నుండి ఐదుగురిని రక్షించామని, మరో 20మందికి పైగా చిక్కుకుపోయి ఉండవచ్చని స్థానికులు పేర్కొన్నారు. 

సమాచారం అందుకున్న జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.