మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (13:20 IST)

కోవై ఆస్పత్రిలో వృద్ధురాలి మృతదేహాన్ని కొరికి తిన్న పిల్లి.. వీడియో వైరల్

కోయంబత్తూరులో దారుణం చోటుచేసుకుంది. కోవై ప్రభుత్వాసుపత్రిలో ఓ వృద్ధురాలి మృతదేహాన్ని పిల్లి కొరికి తినింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కోవై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఓ వృద్ధురాలు సోమవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని ఎవరూ తీసుకునేందుకు రాని కారణంగా.. ఆస్పత్రి సిబ్బంది మార్చురీలో వుంచకుండా.. వార్డులోనే వదిలిపెట్టేశారు. 
 
ఈ నేపథ్యంలో ఓ పిల్లి వృద్ధురాలి మృతదేహాన్ని కొరికి తింది. దీనిపై కొందరు యువకులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీసినా వారి నుంచి నిర్లక్ష్యంగా బదులు వచ్చింది. దీంతో ఆగ్రహించిన యువకులు వృద్ధురాలి మృతదేహాన్ని పిల్లి కొరికి తిన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 
 
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఆ మృతదేహాన్ని మార్చురీలోకి తీసుకెళ్లారు. ఈ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.