గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (09:57 IST)

బ్యూటీఫుల్ బంగ్లా అమ్మాయిలతో పడుపువృత్తి.. ఎక్కడ?

అందమైన అమ్మాయిలను బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. ఈ పడుపువృత్తి కేంద్రం సభ్యులను అరెస్టు చేసి, ఆ కేంద్రంలో ఉన్న అమ్మాయిలకు విముక్తి కల్పించారు. ఈ ఘటన బెంగుళూరు నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొందరు అందమైన అమ్మాయిలను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తీసుకువచ్చి బెంగళూరులో పడుపువృత్తి నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు నిఘా వేసి... మహాదేవపుర లక్ష్మీసాగర లేఔట్‌లో వేశ్యవాటిక నడుస్తున్నట్లు తెలిసి దాడులు చేశారు. 
 
ఈ దాడుల తర్వాత పశ్చిమబెంగాల్‌కు చెందిన నౌషద్‌అలీ, స్వరూప్, సమీర్‌ అనే ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 11 నకిలీ ఆధార్‌ కార్డులను సీజ్‌ చేశారు. ఇద్దరు బంగ్లాదేశ్‌ మహిళలను కాపాడారు. మహిళలకు బెంగళూరులో మంచి ఉపాధిని చూపిస్తామని ఇక్కడకు తీసుకొచ్చి బలవంతంగా వేశ్యావృత్తి చేయించేవారని తేలింది.