శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 జనవరి 2017 (14:59 IST)

టాయిలెట్స్‌లో సీసీ కెమెరాలు.. ప్యాంటు విడిచి లుంగీ కట్టుకోవాలట.. ఫైర్ క్రాకర్ కారణమట..!

ఇదేంటి? టాయిలెట్స్‌లో సీసీ కెమెరాలా అని షాకవుతున్నారు కదూ.. అవునండి.. ఓ కళాశాల నిర్వాహం ఈ పని చేస్తోంది. తమిళనాడు కోయంబత్తూరులో కోవైపుదూరులో వీఎల్ బీ జానికి యమ్మాళ్ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల ఉంది. కళాశ

ఇదేంటి? టాయిలెట్స్‌లో సీసీ కెమెరాలా అని షాకవుతున్నారు కదూ.. అవునండి.. ఓ కళాశాల నిర్వాహం ఈ పని చేస్తోంది. తమిళనాడు కోయంబత్తూరులో కోవైపుదూరులో వీఎల్ బీ జానికి యమ్మాళ్ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల ఉంది. కళాశాల మరుగుదొడ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నఓట్లు 24.01.2017వ తేదీన ఓ సర్క్యూలర్ జారీ చేసింది. 
 
టాయిలెట్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కారణం కూడా ఉందని చెప్పింది. కొందరు విద్యార్థులు టాయిలెట్స్‌లో పెట్టిన ఓ ఫైర్ క్రాకర్ వల్ల ఓ లెక్చరర్ గాయపడ్డాడనని పేర్కొంది. అందువల్ల టాయిలెట్స్‌కు వెళ్లే వారు ప్యాంటు విప్పి లుంగీ కట్టుకొని వెళ్లాలని సూచించింది. 
 
కళాశాల జారీ చేసిన సర్క్యూలర్ తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కళాశాల నిర్వాకంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి కళాశాల నిర్వాకం వెనక్కి తగ్గుతుందో లేదో వేచి చూడాలి.