బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (17:14 IST)

అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టాల్సిందే: సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్లలోను సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
 
ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. అధికారం ఉన్నవారికి..డబ్బులు ఉన్నవారికి పోలీసులు కొమ్ముకాస్తూ..సమాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు మాత్రం పోవటంలేదు.

కొన్ని పీఎస్ లు ఏకంగా సెటిల్ మెంట్లకు అడ్డాగా మారుతున్నాయి. లాకప్ డెత్, బెదరింపులు, వసూళ్లు, అక్రమార్కులకు అండాదండ ఆరోపణలతో ఆ వ్యవస్థపై నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. కొన్ని సందర్భాల్లో పీఎస్ లలో జరుగుతున్న సందర్భాలు లేకపోలేదు.
 
ఏపీలో ఓ దళితుడికి స్టేషన్‌లో శిరోముండనం చేయించడం కలకలకం రేపిన తెలిసిందే. కొన్ని స్టేషన్‌లలో మాటల్లో చెప్పలేని ఘోరాలు కూడా జరగుతుంటాయి. ఏకంగా మద్యం తాగి పోలీసులే చిందులు వేయటం చూశాం.

ఇలా పీఎస్ లలో జరిగేది ప్రతీదీ పారదర్శకంగా ఉండాలనే ఉద్ధేశ్యంతోను..తద్వారా సామాన్యులకు న్యాయం జరగాలనే యోచనతో పీఎస్ ల విషయంలో సుప్రీం కోర్టు జూలు విదిలించింది.

అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల సీఎస్ లకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పనులు ఎంత వరకూ జరిగాయో తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా ఆదేశించింది.