బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (09:07 IST)

శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు రామ్ గోపాల్ వర్మ..ఎందుకో తెలుసా?

దిశ అత్యాచారం, హత్య ఘటనపై సినిమా తీస్తానని ప్రకటించిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

క్రైమ్ సీన్ మొదలు, పోలీసుల ఎంక్వైరీలో నిందితులు చెప్పిన విషయాల వరకు అన్నీ తెలుసుకునేందుకు స్వయంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పనిలో భాగంగా సోమవారం ఆయన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

దిశ కేసు గురించి మాట్లాడేందుకు ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్‌తో సమావేశం కావాలని వర్మ భావించారు. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్వరరావుతో కాసేపు ముచ్చటించి.. హైదరాబాద్ చేరుకున్నారు వర్మ.