శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (20:23 IST)

భారత్‌లో 35 యూట్యూబ్ ఛానల్స్‌పై నిషేధం.. ఎందుకంటే?

భారత్‌లో 35 యూట్యూబ్ ఛానల్స్ నిషేధానికి గురైయ్యాయి. ఈ మేరకు ఫేక్ న్యూస్‌ను స్ప్రెడ్ చేస్తున్న 35 యూట్యూబ్ ఛానల్స్‌, 2 ట్విట్టర్ ఖాతాలు, 2 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, 2 వెబ్‌సైట్‌లను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిషేధం విధించింది.
 
దేశంలో సున్నితమైన అంశాలపై తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారనే ఆరోపణలతో యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకుంది కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ. 
 
కాశ్మీర్, ఇండియన్ ఆర్మీ, భారతదేశంలోని మైనారిటీ కమ్యూనిటీలు, రామమందిరం, జనరల్ బిపిన్ రావత్ మొదలైన అంశాలపై కంటెంట్‌ను విద్వేషపూరితంగా పోస్ట్ చేస్తున్నట్లుగా మంత్రిత్వ శాఖ పేర్కొంది. 
 
జనవరి 20వ తేదీన మినిస్ట్రీకి అందిన ఇంటెలిజెన్స్ ఆధారంగా పాకిస్తాన్ నుంచి నిర్వహిస్తోన్న ఈ ఛానెళ్ల నుంచి తప్పుడు సమాచారం ప్రసారం అవుతోందని అధికారులు గుర్తించారు.
 
జనవరి 19న, సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, దేశానికి వ్యతిరేకంగా పనిచేసే కుట్రదారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు.