గురువారం, 16 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2015 (16:19 IST)

చెన్నై వరదలు: కరెంటు లేదు.. తల్లి శవం పక్కనే 20 గంటల పాటు జాగారం

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తినడానికి తిండి.. తాగడానికి నీరు లేకుండా ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు అనారోగ్యం పాలైతే ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడితే మరోవైపు.. చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా వీలు కాని పరిస్థితి ఆవేదనకు గురిచేస్తోంది.
 
చెన్నై నగరంలోని అశోక్ నగర్‌లో ఓ మహిళ తన తల్లి శవం పక్కన కూర్చొని 20 గంటలుగా జాగారం చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన తల్లి డయాలిసిస్ పేషంట్ అని... బుధవారమే ఆమె ప్రాణాలు కోల్పోయింది. కరెంట్ లేకపోవడంతో ఆమె భౌతికకాయం చీకటిలోనే ఉందని తెలిపింది. అంతేకాదు అమె తల్లి భౌతికకాయం పాడైపోయే స్థితిలో ఉంది. 
 
ఎవరైనా తనకు సహాయం చేయాలని, శ్మశానానికి తరలించేందుకు వాహనం పంపించాలని ఆమె వేడుకుంటోంది. శ్మశానాలు సైతం నీట మునిగిపోవడంతో ఆ మహిళకు అంత్యక్రియలు జరపడం కష్టంగా మారింది. ఇలాంటి ఆవేదనకు గురిచేసే ఘటనలెన్నో చెన్నైలో చోటుచేసుకుంటున్నాయి. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.