శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (06:08 IST)

చెన్నై నుంచి బెంగళూరు : విమానంలో 50 మినిట్స్.. రైలులో 30 నిమిషాలు.. సాధ్యమేనా?

ప్రపంచంలోనే అతిపెద్ద రైలు వ్యవస్థ కలిగిన దేశం భారత్. ప్రస్తుత ఈ రైళ్ళ గరిష్ట వేగం 150 కిలోమీటర్లు. అదీ కూడా వేళ్ళపై లెక్కించదగిన రైళ్లు మాత్రమే ఈ తరహా వేగంతో నడుస్తున్నాయి. మిగిలినవన్నీ సగటున గంటకు 50

ప్రపంచంలోనే అతిపెద్ద రైలు వ్యవస్థ కలిగిన దేశం భారత్. ప్రస్తుత ఈ రైళ్ళ గరిష్ట వేగం 150 కిలోమీటర్లు. అదీ కూడా వేళ్ళపై లెక్కించదగిన రైళ్లు మాత్రమే ఈ తరహా వేగంతో నడుస్తున్నాయి. మిగిలినవన్నీ సగటున గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తున్నాయి. దీంతో ప్రయాణ సమయాన్ని ఆదా చేసేందుకు దేశంలో బుల్లెట్ రైళ్ళను నడిపేందుకు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది.
 
ఇదిలావుండగా, హైపర్‌లూప్ అనే సంస్థ సరికొత్త రైలు వ్యవస్థతో ముందుకు వచ్చింది. అందే హైపర్‌లూప్ ట్రైన్స్. ప్రస్తుతం చెన్నై - బెంగుళూరుల మధ్య ప్రయాణ సమయం విమానంలో 50 నిమిషాలుగా ఉంది. కానీ, హైపర్‌లూప్ రైళ్లు అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం కేవలం 30 నిమిషాలేనట.
 
హైపర్‌లూప్‌ వన్‌ సంస్థ రూపొందిస్తున్న ప్రణాళికలు కార్యరూపం దాల్చితే.. చెన్నై - బెంగుళూరుల మధ్య ప్రయాణ సమయం 30 నిమిషాలే. అదీ నేల మార్గంలోనే. దీనిపై ఆ సంస్థ కేంద్రానికి ప్రతిపాదనలు కూడా చేసింది. చెన్నై-బెంగళూరు, చెన్నై-ముంబై, పుణె-ముంబై, బెంగళూరు-తిరువనంతపురం, ముంబై-ఢిల్లీ మార్గాల్లో ఈ సదుపాయాన్ని కల్పించేందుకు హైపర్‌లూప్‌ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది.
 
ఇవే మార్గాలను బుల్లెట్‌ రైళ్ల కోసం కూడా పరిశీలిస్తున్నారు. చైనా, జపాన్‌కు చెందిన బృందాలు ఈ మేరకు అధ్యయనాలు కూడా చేస్తున్నాయి. అయితే బుల్లెట్‌ రైళ్ల వ్యవస్థ కన్నా చౌకగా తమ వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణ సాధ్యమవుతుందని హైపర్‌లూప్‌ చెబుతోంది. శూన్యత్వమున్న గొట్టపు మార్గాలను నిర్మించి.. అయస్కాంత శక్తిని ఉపయోగించి రైళ్లను అధిక వేగంతో నడపవచ్చని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొంది 
 
ప్రస్తుతం ఈ తరహా రైలు మార్గాన్ని దుబాయ్‌ - అబుదాబిల మధ్య నిర్మించే అవకాశాలు ఉన్నాయి. దీని ఏర్పాటుకు ఐదేళ్లు పట్టొచ్చు. రెండు నగరాల మధ్య ప్రస్తుతం 90 నిమిషాలు ప్రయాణం చేయాల్సి ఉండగా.. ఈ మార్గం ఏర్పాటైతే అది 12 నిమిషాలకు తగ్గిపోనుంది.