ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (13:03 IST)

అమ్మ.. అక్కపై అలిగిన రాహుల్... ఎందుకో తెలుసా?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అలిగారు. అమ్మ, అక్కలపై ఫైర్ అయ్యారు. మీ ఇద్దరి నిర్ణయం సరిగా లేదంటూ విభేదించారు. కానీ, చివరకు వారిద్దరి ప్రేమకు రాహుల్ తలొంచారు. ఇంతకు తల్లీబిడ్డల మధ్య జరిగిన వివాదం ఏంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ముఖ్యంగా, బీజేపీ కంచుకోటలుగా భావిస్తున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. 
 
ఈ రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపిక కోసం ఈ తల్లీబిడ్డలు ఢిల్లీలోని రాహుల్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ మూడు రాష్ట్రాలకు సీఎంలుగా యువ నేతలను ఎంపిక చేయాలని రాహుల్ పట్టుబట్టారు. 
 
అదేసమయంలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలు వృద్ధతరానికి, అనుభవజ్ఞులకు పట్టంకట్టాలని పంతం పట్టినట్టు సమాచారం. దీంతో ఈ ముగ్గురు మధ్య వాడివేడిగా చర్చలు జరిగాయి. ఆ సమయంలో తల్లి, అక్కపై అలిగి రాహుల్ మూడుసార్లు ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
ముఖ్యంగా, వచ్చే యేడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సోనియా, ప్రియాంక సీనియర్లకే ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని వాదించగా, దీన్ని రాహుల్ అంగీకరించలేదు. చివరకు తల్లీఅక్కల ప్రేమకు రాహుల్ తలొగ్గి మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎంగా సీనియర్ నేత కమల్‌నాథ్‌ను ఎంపిక చేశారు. రాజస్థాన్ సీఎం పీఠం రేసులో అశోక్ గెహ్లాట్‌, సచిన్ పైలట్‌ల మధ్య తీవ్రపోటీ నెలకొనివుంది.