సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Modified: శుక్రవారం, 30 నవంబరు 2018 (13:00 IST)

ప్రియాంకా చోప్రా కంటే ముందుగా నిక్ ఎంతమందితోనో....

డిసెంబరు 2న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాను పెళ్లి చేసుకోబోతున్న అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ మామూలోడు కాదు. ప్రియాంకా చోప్రా కంటే ముందు అతడు పలువురు యువతులతో చేసిన డేటింగ్ లిస్టు చాలా పెద్దదిగానే వుంది. ప్రచారంలో వున్న కొన్ని పేర్లను చూస్తే... 2009లో అమెరికన్ పాప్ స్టార్ మైలితో నిక్ ప్రేమలో పడ్డాడంటూ వార్తలు వచ్చాయి కానీ ఆమె వేరేవాడితో లవ్ కన్ఫర్మ్ చేసుకుంది. 
 
ఆ తర్వాత మరో పాప్ స్టార్ సెనేనాతో లవ్‌లో పడ్డానంటూ ప్రకటించాడు కానీ అదీ పెటాకులైంది. బ్రిటిష్ సింగర్ రిటాపై క్రష్ వుందని చెప్పి కొన్నాళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు కానీ పట్టాలు తప్పాయి. ఇక మిస్ యుఎస్‌లో పాల్గొన్న ఒలివియాతో రెండేళ్లపాటు ప్రేమ అంటూ తిరిగాడు కానీ అది కూడా ముగిసిపోయింది. ఎట్టకేలకు బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాను పెళ్లి చేసుకునేందుకు ఫిక్సయ్యాడు. వీరి పెళ్లి డిసెంబరు 2న అట్టహాసంగా జరుగబోతోంది.