శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2016 (10:53 IST)

అమ్మ కోలుకున్నారు.. ఆదివారం డిశ్చార్జ్ అవుతున్నారు... దీపావళి సంబరాలు కార్యకర్తలతోనే?

తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యం కోలుకున్నట్లు వార్తలొచ్చాయి. త్వరలోనే ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నట్లు అపోలో వైద్యులే స్వయంగా ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జయను వచ్చే ఆదివారం దీపావ

తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యం కోలుకున్నట్లు వార్తలొచ్చాయి. త్వరలోనే ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నట్లు అపోలో వైద్యులే స్వయంగా ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జయను వచ్చే ఆదివారం దీపావళి పండుగ రోజున డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దీపావళి పండుగను ఆమె ఫ్యాన్స్‌తో కలిసి జరుపుకోనున్నట్లు సమాచారం. జయలలిత కోలుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు అన్నాడీఎంకే కార్యకర్తలు, ప్రజలు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు ఆకాంక్షించారు. 
 
సెప్టెంబర్ 22న అనారోగ్యంతో బాధపడుతూ.. అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఆసుపత్రిలో చేరి నేటికి సరిగ్గా నెలా మూడురోజులైనాయి. ఈ నెల రోజుల్లో ఆమె ఆరోగ్య పరిస్థితిపై రకరకాల పుకార్లు షికార్లు చేశాయి.

కానీ తాజాగా వైద్యులు చేసిన ప్రకటన అమ్మ అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. జయలలిత కోలుకుంటున్నారని, కొద్దిరోజుల్లో డిశ్చార్జ్ చేస్తామనడంతో అభిమానులు పండగ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు