మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 17 నవంబరు 2016 (11:28 IST)

ఎయిర్ ఇండియా భోజనంలో బొద్దింక.. ఎయిర్‌లైన్స్ బొద్దింకలతో కూడిన శాకాహారం ఇస్తుందని?

ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించింది. ఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా చికాగో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన ఓ ప్యాసింజర్‌కు ఎయిర్ లైన్స్ అందించిన భోజనంలో బొద్దింక ప

ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించింది. ఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా చికాగో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన ఓ ప్యాసింజర్‌కు ఎయిర్ లైన్స్ అందించిన భోజనంలో బొద్దింక ప్రత్యక్షం అయింది. చికాగో వెళుతున్న ఓ ప్రయాణికుడు తనకు ఎయిర్ లైన్స్ సంస్థ అందించిన భోజనంలో బొద్దింక ఉందని దాని ఫోటోలతో ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఎయిర్ ఇండియా ప్రస్తుతం బొద్దింకలతో కూడిన శాకాహార భోజనం పెడుతుందని.. దీనివల్ల అనారోగ్యం పాలయ్యానని రాహుల్ రఘువంశీ అనే యువకుడు ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అయ్యింది. 
 
అయితే ఆహారంలో బొద్దింక వ్యవహారం చినికి చినికి గాలివానలా మారకముందే.. ఈ ఘటనతో అసౌకర్యం కలిగిన ప్రయాణికుడికి ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది. విమానంలో భోజనం అందించిన కేటరింగ్ సంస్థకు నోటీసు జారీ చేయడంతోపాటు ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని ఎయిర్ లైన్స్ సీనియర్ మేనేజరు ధనుంజయ్ కుమార్ తెలిపారు. దీనిపై తాము బేషరతుగా క్షమాపణలు చెపుతున్నామని.. దీనిపై సరైన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.