ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 21 జనవరి 2017 (12:57 IST)

ఇష్టంతో చేయించుకున్న సెక్స్‌ను ఏ ఆడపిల్లా రేప్ అని అనదు : బాంబే హైకోర్టు

ఇష్టపూర్వకంగా ప్రియుడితో చేయించుకున్న శారీరక సంభోగాన్ని ఏ ఆడపిల్ల కూడా రేప్ అని అనదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, ప్రేమించుకుని విడిపోయాక ప్రియుడిపై ప్రియురాలు రేప్ కేసు పెట్టడం ఇపుడ

ఇష్టపూర్వకంగా ప్రియుడితో చేయించుకున్న శారీరక సంభోగాన్ని ఏ ఆడపిల్ల కూడా రేప్ అని అనదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, ప్రేమించుకుని విడిపోయాక ప్రియుడిపై ప్రియురాలు రేప్ కేసు పెట్టడం ఇపుడు ఓ ట్రెండ్‌గా మారిపోయిందని పేర్కొంది. 21 యేళ్ల యువకుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడనీ.. ఆ తర్వాత వదిలేశాడంటూ అతడిపై ఓ యువతి రేప్ కేసు పెట్టింది. ఈ కేను విచారణకు స్వీకరించిన కోర్టు.. పై విధంగా వ్యాఖ్యానించింది. 
 
ఈ కేసులో ప్రియురాలు పెట్టిన కేసులో అరెస్టు చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రియుడు కోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. అతడికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన న్యాయమూర్తి మృదుల భట్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
 
ప్రేమించుకున్న జంటలు విడిపోయిన తర్వాత ఎదుటి వ్యక్తిపై రేప్ కేసు పెట్టడం ట్రెండ్‌గా మారిపోయిందనీ... అయితే కోర్టులు మాత్రం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. బాధితురాలి బాధలు.. నిందితుడి జీవితం, స్వేచ్ఛ... ఈ రెండిటి మధ్య కోర్టులు సమతుల్యం సాధించాల్సి ఉంటుందన్నారు. 
 
కాగా పెళ్లికంటే ముందు తమ అంగీకారంతోనే జరిగిన శృంగారాన్ని చదువుకున్న ఆడపిల్లలెవరూ రేప్ అనరనీ.... తద్వారా ఎదుర్కోబోయే పరిణామాలు ఎలా ఉంటాయో వారికి ముందే తెలుసు కాబట్టి ఎవరి నిర్ణయానికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.