గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (08:27 IST)

ఆఫీసులు, స్కూళ్లలో కరోనా వ్యాక్సిన్ సెంటర్లు!

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ల పంపిణీకి ఏర్పాట్లు షురూ అయ్యాయి. పోలింగ్ సెంటర్ల తరహాలోనే వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి టీకాలు వేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

వ్యాక్సిన్ స్టోరేజ్, పంపిణీకి సంబంధించిన అన్ని విషయాలనూ వివరిస్తూ గైడ్ లైన్స్ జారీ చేసింది. తొలి దశలో కోటి మంది హెల్త్ వర్కర్లకు, ఆ తర్వాత రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్ల(పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు, ఆర్మీ, హోంగార్డులు, జైళ్ల శాఖ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సిబ్బంది)కు, మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 50 ఏండ్ల వయసు దాటిన వారికి, 50 ఏండ్ల కంటే తక్కువ వయసుండి ఇతర జబ్బులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం చెప్పింది.

వీరు దేశవ్యాప్తంగా27 కోట్ల మంది ఉంటారని అంచనా వేసింది. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల ఓటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డుల్లోని వివరాల ఆధారంగా 50 ఏండ్లు దాటినవారిని గుర్తించి, వివరాలను సేకరించాలని చెప్పింది. ఈ మూడు కేటగిరీల వారికి కొవిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ర్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా అవకాశం ఇవ్వనున్నట్టు వెల్లడించింది.
 
రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్లకే..
రిజిస్ర్టేషన్ సమయంలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది. ముందస్తుగా రిజిస్ర్టేషన్ చేసుకున్నవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని, నేరుగా సెంటర్ల వద్దకు వచ్చినవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాక్సిన్ ఇవ్వొద్దని ఆదేశించింది.

వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఏదైనా నెగెటివ్ రియాక్షన్ వస్తే వెంటనే కొవిన్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాలని చెప్పింది. వాళ్లకు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందించేందుకు డాక్టర్లు, మెడికల్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సిద్ధంగా ఉంచాలని వివరించింది.
 
ఒక సెషన్ లో వంద మందికే..
ఉదయం 9  నుంచి సాయంత్రం 5  వరకూ వ్యాక్సిన్ లు వేయాలని కేంద్రం సూచించింది. హెల్త్ స్టాఫ్​కు ప్రైమరీ హెల్త్ సెంటర్లు, దవాఖాన్లలోనే వ్యాక్సిన్ వేయాలని తెలిపింది. వీరి డేటాను ఇప్పటికే ఆరోగ్యశాఖ సేకరించింది. ఫ్రంట్ లైన్ వర్కర్ల డేటాను ఆయా శాఖల నుంచి సేకరించి, ఆరోగ్య సిబ్బంది రిజిస్ర్టేషన్ చేయనున్నారు. ఓటర్ లిస్ట్ ద్వారా వృద్ధులను, రోగులను గుర్తించనున్నారు.

వీరికి వ్యాక్సిన్ వేయడానికి హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు, ఆఫీసులు, స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లను వాడుకోవచ్చని తెలిపింది. ప్రతి సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెయిటింగ్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెరిఫికేషన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వ్యాక్సినేషన్ హాల్, వెయిటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపల్సరీగా ఉండాలని చెప్పింది. ప్రతి సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వంద మందికి మాత్రమే వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయాల్సి ఉంటుంది. ప్రతి సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఒక వ్యాక్సినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నలుగురు వ్యాక్సినేషన్ ఆఫీసర్లు ఉండాలి.

వ్యాక్సినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డాక్టర్ లేదా నర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లేదా ఇంజక్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించిన వారు ఎవరైనా ఉండొచ్చు. వీరికి ముందుగానే ఆరోగ్యశాఖ ట్రైనింగ్ ఇవ్వాలి. వ్యాక్సినేషన్ లో మొత్తం 23 డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల సిబ్బందికి డ్యూటీలు వేయాలని, ఏయే డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఏయే పనులు చేయాలో గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేంద్రం పేర్కొంది.
 
వ్యాక్సిన్ వేస్కోవాలంటే ఇదీ ప్రాసెస్
♦️వ్యాక్సిన్ కోసం ఆరోగ్యశాఖ వద్ద లేదా కొవిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (www.cowin.gov.in ) వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి.
♦️ఏయే వ్యాక్సిన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎవరికి వ్యాక్సిన్ వేస్తారో ముందుగానే లబ్ధిదారులకు సమాచారం ఇస్తారు.
♦️ఉదయం 9 నుంచి సాయంత్రం 5 లోపు ఏదైనా ఒక గుర్తింపు కార్డు(ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఓటర్ కార్డు వంటివి) తీసుకుని సూచించిన వ్యాక్సినేషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలి.
♦️వ్యాక్సినేషన్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బందికి ఆ కార్డు చూపించి, వెయిట్ చేయాలి.
♦️తర్వాత మరో ఆఫీసర్ వద్దకు వెళ్లి రిజిస్ర్టేషన్ చేసుకున్నట్టు వచ్చిన ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గుర్తింపు కార్డు చూపాలి. ఆఫీసర్లు కోవిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్ర్టేషన్ వివరాలను వెరిఫై చేసిన తర్వాతే వ్యాక్సిన్ వేస్తారు.
♦️వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అరగంట పాటు అక్కడే ఉండాలి. ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే అక్కడున్న డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెప్పాలి.
♦️ఈ ప్రక్రియ పూర్తయ్యాక వ్యాక్సిన్ వేసుకున్నట్టు కో–విన్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసిన కార్డు ఇస్తారు. లబ్ధిదారు మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్ రూపంలో లింక్ వస్తుంది. ఇందులో లబ్ధిదారు పేరు, పుట్టిన తేదీ, అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వ్యాక్సినేషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వ్యాక్సిన్ బ్యాచ్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివన్నీ ఉంటాయి.

అలాగే, సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారు? ఎక్కడ వేస్తారు? అన్న సమాచారం కూడా ఉంటుంది. సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోస్ వ్యాక్సిన్   తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ కార్డు తప్పకుండా తీసుకురావాల్సి ఉంటుంది.