శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (08:20 IST)

అక్రమ వ్యాపారుల కేసులో 2,400 మంది అరెస్ట్‌

జూన్‌ 1 నుండి నవంబర్‌ 30 వరకు అక్రమ ఆయుధాల చట్టం కింద జిల్లాల్లోని వేర్వేరు పోలీస్‌స్టేషన్‌లలో 2,040 కేసులలో 2,431 మందిని అరెస్ట్‌ చేశామని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆర్నెల్ల కాలంలో రికార్డుస్థాయిలో అక్రమ ఆయుధ వ్యాపారాన్ని అరికట్టామని అన్నారు. పలు గ్యాంగ్‌లను చేధించామని, వందలాది మందిని అరెస్ట్‌ చేశామని, భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

1,493 దేశీయంగా తయారు చేసిన పిస్టల్స్‌, 195 రివాల్వర్లు, 14 రైఫిల్స్‌ మొత్తంగా 1,702 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

వీటితో పాటు 3,198 తూటాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వివిధ పోలీస్‌స్టేషన్లు, క్రైమ్‌ బ్రాంచ్‌, స్పెషల్‌ సెల్‌ ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గన్నాయని అన్నారు.