శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (15:27 IST)

సవతి తల్లి దాష్టీకం.. చితక్కొట్టి గోనె సంచిలో కుక్కింది... (వీడియో)

చండీఘర్‌లో ఓ సవతి తల్లి విచక్షణారహితంగా ప్రవర్తించింది. తన భర్త మొదటి భార్యకు పుట్టిన కుమార్తెను చావబాదడమేకాకుండా, గోనె సంచలి కుక్కి తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసింది.

చండీఘర్‌లో ఓ సవతి తల్లి విచక్షణారహితంగా ప్రవర్తించింది. తన భర్త మొదటి భార్యకు పుట్టిన కుమార్తెను చావబాదడమేకాకుండా, గోనె సంచలి కుక్కి తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసింది. దీనిపై సదరు భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
చండీఘర్‌లోని సెక్టార్ 29కు చెందిన ఓ వ్యక్తి తన మొదటి భార్య కేన్సర్ కారణంగా చనిపోవడంతో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే, తన మొదటి భార్యకు పుట్టిన బిడ్డ కూడా తమతోనే ఉంచుకున్నాడు. అయితే, సవతి తల్లి ఆ చిన్నారి పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. 
 
ఐదేళ్ల కుమార్తెను చావచితక్కొట్టి, ఒక సంచీలో కుక్కిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సవతి తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.