దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో 18,139 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తాజా బులిటెన్‌ను విడుదల చేసింది.
అదే సమయంలో 20,539 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,13,417కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 234 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 1,50,570 కు పెరిగింది.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,00,37,398 మంది కోలుకున్నారు. 2,25,449 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.