శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (15:53 IST)

20 వేల దిగువకు కరోనా కేసులు - మూడు లక్షల దిగువకు క్రియాశీల కేసులు

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..సోమవారం 20వేలకు దిగువకు చేరాయి. 19,556 కొత్త కేసులు వెలుగుచూశాయి. జులై ప్రారంభంలో మాత్రమే ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయి. దాంతో ఇప్పటివరకు 1,00,75,116 మంది వైరస్ బారిన పడ్డారు.
 
ఇక క్రియాశీల కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఆ కేసులు మూడు లక్షల దిగువకు చేరి..2,92,518గా ఉన్నాయి. క్రియాశీల రేటు 2.90శాతానికి చేరగా..రికవరీ రేటు 95.65శాతంగా ఉంది. ఇప్పటి వరకు 96,36,487 మంది వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. వరసగా పదో రోజు కూడా మరణాల సంఖ్య 400ల దిగువకు పడిపోయింది. గడిచిన 24 గంటల్లో 301 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 1,46,111గా ఉంది. అలాగే ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం..10,72,228 మందికి నిన్న వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
 
ప్రతి పది లక్షల మందిలో.. దేశంలో ప్రతి పది లక్షల మందిలో వైరస్ బారిన పడినవారు, సంభవించిన మరణాలు, అలాగే నిర్వహించిన టెస్టుల సంఖ్యను మంత్రిత్వ గ్రాఫ్ రూపంలో విడుదల  చేసింది. 7,286.6 మంది వైరస్ బారిన పడగా, 105.7 మరణాలు సంభవించాయి. అలాగే 1,17,462.6 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది..