కోతి ఓ వ్యక్తి ప్రాణం తీసింది అంటే నమ్ముతారా?
కోతి ఓ వ్యక్తి ప్రాణం తీసింది అంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే. ఢిల్లీలో ఓ వానరం చేసిన పనికి ఓ మనిషి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ ఢిల్లీలోని నబికరీం ప్రాంతంలో నివాసం ఉంటున్న మహ్మద్ కుర్బాన్ అనే వ్యక్తి తలపై ఓ ఇంటి నుంచి ఇటుక రాయి పడింది. దీంతో అతని తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాదానికి కారకులెవరో తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
విచారణలో కోతులకు భయపడి ఓ వ్యక్తి నీటి ట్యాంకులపై ఇటుక రాళ్లు పెట్టే వాడని... ఈ క్రమంలోనే ఇంటిపైకి వచ్చిన కోతి ఆ ఇటుకను కిందకు విసరగా, మహ్మద్ కుర్బాన్ పై పడిందని తెలిపాడు. అలసత్వంతోనే కోతులు ఇటుకలను కింద పడేశాయని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఇటుక పడే మహ్మద్ కుర్బాన్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.