గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 జనవరి 2017 (14:54 IST)

పట్టుమని రెండేళ్లైనా ఉండవ్.. రూ.60లక్షల బంగారాన్ని దోచేసిన బచ్చా చోర్

పట్టుమని రెండేళ్లు కూడా ఉండవు. అయితే ఓ చోటా దొంగ రూ.60లక్షల విలువైన నగల బ్యాకును భుజానికి తగిలించుకుని చెక్కేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? అందరూ పెళ్లి హడావుడిలో ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్లున్నారు. ఇంత

పట్టుమని రెండేళ్లు కూడా ఉండవు. అయితే ఓ చోటా దొంగ రూ.60లక్షల విలువైన నగల బ్యాకును భుజానికి తగిలించుకుని చెక్కేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? అందరూ పెళ్లి హడావుడిలో ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్లున్నారు. ఇంతలో ఓ చోటా దొంగ పెళ్లి సందడిని అదనుగా తీసుకుని రూ.60లక్షల నగల్ని దోచుకున్నాడు. 
 
సీసీ కెమెరాలు తప్ప ఎవరూ అతడిని గమనించలేదు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. పెళ్లిలో ఎవరూ పట్టించుకోరన్న ఉద్దేశంతో, ఇదే అదనుగా అక్కడి వచ్చాడో బచ్చా చోర్. సైలెంటుగా ఎంటరై భారీ మొత్తాన్ని దోచుకెళ్లాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న పెళ్లి బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, ఆ దొంగతో పాటు మరికొందరు వివాహంలోకి వచ్చి ఉండవచ్చని, బంధువుల మాదిరిగా కలిసిపోయి దొంగతనం చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.