శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (12:16 IST)

కరోనాను గెలిచి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కానిస్టేబుల్ భార్య

కరోనాతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దేశం మొత్తం లాక్ డౌన్‌లో వుంది. ఇలాంటి పరిస్థితి ఓ మహిళ కోవిడ్ నుంచి కోలుకుంది. అంతేగాకుండా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని జహంగీర్‌పూరి పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ దేవేందర్‌కు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 
 
ఆయన భార్యకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు కూడా పాజిటివ్‌ అని తేలింది. కరోనా సోకిన సమయంలో పోలీసు భార్య నిండు గర్భిణి. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరినీ ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందించారు. 
 
మొత్తానికి ఈ ఇద్దరు కరోనాతో పోరాడి గెలిచారు. భార్యాభర్తలిద్దరికీ కరోనా నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఐసోలేషన్‌ వార్డు నుంచి డిశ్చార్జి అయిన గర్భిణి.. మే 8వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.