శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

కరోనా కేసులు : యూఎస్ - యూకేల్లో లక్షల్లో.. రష్యా - ఇండియాలో వేలల్లో

కరోనా వైరస్ మహమ్మారి మరింత ఉధృతంగా మారుతోంది. పలు దేశాల్లో లాక్డౌన్ ఎత్తివేయడం వల్ల, మరికొన్ని దేశాల్లో పౌరుల అలసత్యం కారణంగా ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా, అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, బ్రెజిల్ వంటి దేశాల్లో లక్షల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. 
 
ప్రపంచవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే లక్ష కేసులు నమోదు కాగా, అమెరికాలో 26,398 కేసులు వెలుగుచూశాయి. బ్రెజిల్‌లో 13,761, రష్యాలో 9,974 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఆయా దేశాల్లో కరోనా వైరస్ విజృంభణకు నిదర్శనగా చెప్పుకోవచ్చు. 
 
మరోవైపు, భారత్, ఇటలీ, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఈ కేసుల సంఖ్యల వేలల్లో ఉంది. ఇండియాలో గురువారం ఒక్క రోజే 3,942 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 45 లక్షల మార్క్ దాటిపోయింది.
 
ఇకపోతే, కరోనా వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గురువారం అమెరికాలో 1,703 మంది, స్పెయిన్‌లో 217 మంది, బ్రిటన్‌లో 428 మంది, ఇటలీలో 262 మంది, బ్రెజిల్‌లో 835 మంది, ఫ్రాన్స్‌లో 351 మంది మెక్సికోలో 294 మంది, కెనడాలో 170 మంది ప్రాణాలు కోల్పోయారు.