సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (12:32 IST)

దినకరన్ మోసగాడు.. జయమ్మ వారసులు ఓపీఎస్.. మధుసూదన్ మాత్రమే: దీపక్‌

తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్న టీటీవీ దినకరన్‌కు ఝలక్ ఇవ్వడానికే శుక్రవారం ఆ రాష్ట్రంలో ఐటీ దాడులు జరిగాయని సమాచారం. దినకరన్ హద్దు మీరి ఎగిరిపడటంతోనే ఆయన్ను అదుపులో పెట్టడానికి ఐటీ దాడులు జరి

తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్న టీటీవీ దినకరన్‌కు ఝలక్ ఇవ్వడానికే శుక్రవారం ఆ రాష్ట్రంలో ఐటీ దాడులు జరిగాయని సమాచారం. దినకరన్ హద్దు మీరి ఎగిరిపడటంతోనే ఆయన్ను అదుపులో పెట్టడానికి ఐటీ దాడులు జరిగాయని తెలిసింది. దినకరన్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడం కేంద్రంలోని పెద్దలకు ఇష్టం లేదని తెలిసింది. 
 
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచి ఎడప్పాడి పళనిసామిని తప్పించి తమిళనాడు సీఎం కావాలని దినకరన్ ప్లాన్ వేశారని సమాచారం. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన తరువాత తనను సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని దినకరన్ ధీమాగా ఉన్నారని తెలిసింది. ఆర్‌కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ విచ్చలవిడిగా డబ్బు పంచిపెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. 
 
ఈ సందర్భంలో దినకరన్‌కు ఝలక్ ఇవ్వడానికే ఆయనకు అత్యంత సన్నిహితుడైన తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారని సమాచారం.
 
ఈ నేపథ్యంలో జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆర్కేన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌ల్లో శ‌శిక‌ళ వ‌ర్గం త‌ర‌ఫునుంచి దినకరన్ పోటీకి దిగిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న పెద్ద మోస‌గాడ‌ని జయలలిత మేనల్లుడు దీపక్‌ జయకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక‌, పార్టీతో పాటు ప్రభుత్వాన్ని నడిపించే అధికారం శశికళ వర్గానికి లేదని ఆయ‌న అన్నారు. 
 
జయల‌లిత‌కు నిజమైన రాజకీయ వారసులు పన్నీర్‌ సెల్వం, మధుసూదనన్‌ మాత్రమేనని తెలిపారు. జయల‌లిత ఫొటోతో ఎన్నిక‌ల్లో ప్రచారం చేసుకునే అర్హత దినకరన్‌కు లేదని, అధికార పీఠం ఎక్కాల‌నుకుంటున్న దినకరన్ ఆశ‌లు నెర‌వేర‌బోవ‌ని అన్నారు.