శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2016 (16:52 IST)

నా రాజకీయ వారసుడు స్టాలిన్ : తేల్చి చెప్పిన డీఎంకే చీఫ్ కరుణానిధి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి తన రాజకీయ వారసుడి గురించి తన మనసులోని మాటను బహిర్గతం చేశాడు. ప్రస్తుతం పార్టీ కోశాధికారిగా ఉన్న తన తనయుడు ఎంకే స్టాలినే తన రాజకీయ వారసుడు అని ఆయన ప్ర

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి తన రాజకీయ వారసుడి గురించి తన మనసులోని మాటను బహిర్గతం చేశాడు. ప్రస్తుతం పార్టీ కోశాధికారిగా ఉన్న తన తనయుడు ఎంకే స్టాలినే తన రాజకీయ వారసుడు అని ఆయన ప్రకటించారు. తన తర్వాత పార్టీ పగ్గాలను 63 యేళ్ళ స్టాలిన్ చేపడుతారని స్పష్టం చేశారు. 
 
కాగా, ప్రస్తుతం కరుణానిధి వయసు 93 యేళ్లు. ఇప్పటికే వృద్ధాప్య సమస్యలతో ఆయన బాధపడుతూ చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తన మనసులోని మాటను వెల్లడించారు. పార్టీని పటిష్టపరిచేందుకు స్టాలిన్ ఎంతో శ్రమించారనీ ఈ సందర్భంగా కరుణానిధి కితాబిచ్చారు. 
 
మరోవైపు, దక్షిణ తమిళనాడులో గట్టిపట్టు ఉన్న కరుణ పెద్ద కుమారుడు అళగిరి... తన తండ్రి ప్రకటనతో ఏం చేయబోతారో అనే దానిపై డీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే అళగిరి తండ్రితో పాటు.. సోదరుడు స్టాలిన్ పట్ల గుర్రుగా ఉన్న విషయం తెల్సిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అళగిరి.. పార్టీని చావుదెబ్బ కొట్టారు. ఫలితంగానే డీఎంకే అధికారానికి దూరమైంది.