రజినీకాంత్ 'బాషా' చిత్రాన్ని మా నాన్న చూశారు : కరుణానిధి కుమార్తె కనిమొళి
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం ఆయన కావేరి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి ఆయన శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బందులు
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం ఆయన కావేరి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి ఆయన శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడినట్టు ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇదిలావుండగా, ఆరోగ్యం కాస్తంత కుదుటపడటంతో ఆయన శుక్రవారం రాత్రి ల్యాప్ టాప్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'బాషా' చిత్రాన్ని చూశారట. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి వెల్లడించారు.
మరోవైపు, కరుణ ఆరోగ్యం విషమించిందన్న వార్తలతో చెన్నైలోని కావేరి ఆసుపత్రి వద్దకు భారీ ఎత్తున డీఎంకే కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, మీడియా ప్రతినిధులు చేరుకుంటున్నారు. కరుణ పెద్ద కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అళగిరి కూడా మదురై నుంచి హుటాహుటీన చెన్నై చేరుకున్నారు. అలాగే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చారు.