1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 2 అక్టోబరు 2016 (15:23 IST)

నిజామాబాద్ నెహ్రూ పార్కుకెళ్లాడు.. ఎన్‌క్లోజర్‌లోకి దూకేశాడు.. సింహాలను భయపెట్టాడు.. ఆపై..?

నిజామాబాద్‌లో నెహ్రూ జూలాజికల్ పార్కుకు వెళ్లాడు. గొప్పలు చెప్పుకుంటూ సింహాల ఎన్‌క్లోజర్‌లో దూకాడు. అంతే నాలుగు నెలల పాటు జైలు శిక్షకు గురైయ్యాడు. ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ముఖేష్ అనే వ్యక్తి 22వ తేదీ నెహ్రూ జూలాజికల్ పార్కును వెళ్లాడు. మద్యం మత

నిజామాబాద్‌లో నెహ్రూ జూలాజికల్ పార్కుకు వెళ్లాడు. గొప్పలు చెప్పుకుంటూ సింహాల ఎన్‌క్లోజర్‌లో దూకాడు. అంతే నాలుగు నెలల పాటు జైలు శిక్షకు గురైయ్యాడు. ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ముఖేష్ అనే వ్యక్తి 22వ తేదీ నెహ్రూ జూలాజికల్ పార్కును వెళ్లాడు. మద్యం మత్తులో సింహాన్ని సవాల్ చేస్తానని.. స్నేహితుల ముందు సవాల్ చేసి.. ఎన్‌క్లోజర్లోకి దూకాడు. అందులో ఉన్న ఆఫ్రికా సింహాలు రాధిక, కృష్ణను భయపెట్టాలని క్రూరంగా ప్రవర్తించాడు.
 
ఈ సమాచారం అందుకున్న జూ అధికారులు అతడిని బయటికి తీసుకొచ్చారు. అనంతరం ముఖేష్‌పైన ఫిర్యాదు చేశారు. అతడిపై అనధికార అతిక్రమణతో పాటు వన్యప్రాణాల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించి.. కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు అతనికి నాలుగు నెలల నాలుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ.100 జరిమానా విధించింది.