ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2016 (12:12 IST)

ఐటీ దాడులు :: మనిషినే చంపేసినట్టుగా ఫీలవుతున్నాం.. రామ్మోహన్ రావు భార్య

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహన్ రావు భార్య బోరున విలపిస్తున్నారు. ఆమె అలా కన్నీరుకార్చడానికి కారణం ఎవరో తెలుసా మీడియానేనట. ఇటీవల రామ్మోహన్ రావుతో పాటు ఆయన తనయుడు వివేక్

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహన్ రావు భార్య బోరున విలపిస్తున్నారు. ఆమె అలా కన్నీరుకార్చడానికి కారణం ఎవరో తెలుసా మీడియానేనట. ఇటీవల రామ్మోహన్ రావుతో పాటు ఆయన తనయుడు వివేక్ ఇళ్ళలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన విషయం తెల్సిందే. ఈ సోదాల తర్వాత రామ్మోహన్ రావును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారు. 
 
ఈ నేపథ్యంలో రామ్మోహన్ రావు భార్య తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఓ తెలుగు చానల్‌తో మాట్లాడుతూ తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. తమ స్వస్థలంలో ఎంతో పరువు, ప్రతిష్టలున్న కుటుంబం తమదని, మూడు దశాబ్దాల పాటు సొంత రాష్ట్రాన్ని వదిలి తమిళనాడుకు సేవ చేస్తే, తనను, తన బిడ్డలను తనిఖీల పేరు చెప్పి రోడ్డుపైకి ఈడ్చి పారేశారన్నారు. మీడియా వాళ్లను చూస్తే భయపడి తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని అన్నారు. 

ఈ ఐటీ దాడులతో నిజాయతీపరుడిని రోడ్డుపైకి లాగి పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషినే చంపేసినట్టుగా ఫీలవుతున్నామని, ఎందుకు ఇలా చేశారో తెలియడం లేదని అన్నారు. ఏం పాపం చేశామని ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. తనపై కుట్రను తట్టుకోలేకనే ఆయనకు గుండెపోటు వచ్చిందన్నారు. తానుంటున్న వీధిలో కూడా తానెవరో ఎవరికీ తెలియదని, ఆరేళ్లుగా ఇక్కడే ఉంటున్నా ఎన్నడూ బయటకు రాలేదని, తమ కుటుంబాన్ని ఇలా ఎందుకు వేధిస్తున్నారో తెలియడం లేదని విలపించారు.
 
కాగా, రామ్మోహన్ రావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తనకు ప్రాణముప్పు పొంచివున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. పైగా, తన ఇంట్లో ఐటీ అధికారుల దాడులు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా తన ఇంటిలో సోదాలు చేశారని, రాష్ట్రం అంటే కేంద్రానికి గౌరవం లేదని విమర్శించిన విషయం తెల్సిందే.