సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2017 (06:46 IST)

త్రిపుర సీఎం తల తెచ్చిన వ్యక్తికి రూ.5.5 లక్షలు : ఎఫ్‌బిలో ఫత్వా

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తలకు వెల కట్టారు. ఈ మేరకు గుర్తు తెలియని దుండగుడు ఒకడు సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో ఫత్వా జారీ చేశాడు.

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తలకు వెల కట్టారు. ఈ మేరకు గుర్తు తెలియని దుండగుడు ఒకడు సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో ఫత్వా జారీ చేశాడు. 
 
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ తలను తెచ్చిన వ్యక్తికి 5.5 లక్షల రూపాయల ఇస్తానంటూ ఫేస్‌బుక్‌లో ఫత్వా జారీ చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 
 
నిందితుడు ఇండొర్ నుంచి ఈ పోస్టు పెట్టినట్టుగుర్తించారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు. కాగా, తనను తాను వామపక్ష వ్యతిరేక మండలి కార్యకర్తగా ఆ దుండగుడు పేర్కొన్నాడు.