గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (08:12 IST)

స్క్రాప్ యార్డులో భారీ అగ్నిప్రమాదం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో శుక్రవారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మహానగరంలోని మన్‌ఖుర్ద్‌ ఏరియాలో ఉన్న ఓ భారీ స్క్రాప్‌ యార్డ్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు యార్డ్‌ మొత్తానికి విస్తరించాయి. 
 
దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైరింజన్లతో మాటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.