బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (08:48 IST)

జేఈఈ, నీట్ అభ్యర్థులకు ఉచిత రవాణా..ఎక్కడో తెలుసా?

జేఈఈ, నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ శుభవార్త చెప్పారు. ఈ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ఉచిత రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల ప్రకారం, ఆయా ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి బస్సులు తదితర ట్రాన్స్‌పోర్టేషన్ సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది.

ఈ వాహనాల్లో ప్రయాణించాలంటే పరీక్ష అభ్యర్థులు తప్పకుండా తమ అడ్మిట్ కార్డు చూపించాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయనుంది.