సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (11:14 IST)

మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఆ అదృశ్యశక్తి ఎవరు?

ఇటీవ‌ల ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో జుట్టు క‌త్తిరిస్తున్న ఘ‌ట‌న‌లు వ‌రుస‌గా జరిగాయి. దీంతో ఢిల్లీ వాసులు భీతిల్లిపోయారు. ఇపుడు ఇవి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌‌కూ విస్తరించాయి. ఆడ‌వాళ్ల జుట్టు

ఇటీవ‌ల ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో జుట్టు క‌త్తిరిస్తున్న ఘ‌ట‌న‌లు వ‌రుస‌గా జరిగాయి. దీంతో ఢిల్లీ వాసులు భీతిల్లిపోయారు. ఇపుడు ఇవి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌‌కూ విస్తరించాయి. ఆడ‌వాళ్ల జుట్టు క‌త్తిరిస్తున్న ఆ అదృశ్యశక్తి ఎవరన్నది ఇపుడు అంతుచిక్కని విషయంగా మారింది. ఇలా జట్టు కత్తిరింపు బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
 
ఇటీవల పశ్చిమ ఢిల్లీలోని మియాపురిలోని కొందరు మహిళలకు ఓ అదృశ్యశక్తి జుట్టు కత్తిరించింది. మియాపురి రామ్‌చంద్ర ప్రాంతంలో అర్థరాత్రి ఓ మహిళ సహా ఆమె ముగ్గురు కూతుళ్లకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. బేగంపూర్, ప్రశాంత్ విహార్ ఏరియాలో జుట్టు కత్తిరించబడిన ఘటనలు జరిగాయి. ఇపుడు ఇవి మొరాదాబాద్‌లోని బులంద్‌షహార్‌కు విస్తరించాయి.