ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2017 (05:32 IST)

నా కుమార్తె పెళ్లి ఖర్చు రూ.30 కోట్లే.. భార్య కంపెనీ ద్వారా డబ్బు సమకూరింది : గాలి

కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మణి వివాహం గత యేడాది నవంబరు నెలలో అంగంరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి కోసం ఆయన ఏకంగా రూ.400 కోట్లు ఖర్చు చేసినట్టు వార్తలు వచ్చా

కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మణి వివాహం గత యేడాది నవంబరు నెలలో అంగంరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి కోసం ఆయన ఏకంగా రూ.400 కోట్లు ఖర్చు చేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయనకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు ఆయన సమాధానమిచ్చారు. 
 
వివాహ ఆహ్వాన కార్డుతోనే సంచలనం సృష్టించిన గాలి జనార్ధన్‌రెడ్డి తన కుమార్తె బ్రహ్మణి వివాహానికి కేవలం రూ.30 కోట్లే ఖర్చు పెట్టినచ్చు అందులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఆయన లెక్కలు చూపారు. 
 
నోట్ల రద్దు తర్వాత.. నగదు దొరకక ప్రజలు ఓ వైపు తీవ్ర అవస్థలు పడుతుంటే.. గాలికి తన కుమార్తె పెళ్లికి అంతమొత్తంలో ఖర్చు పెట్టేందుకు డబ్బులెలా వచ్చాయంటూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తదనంతరం పెళ్లి కోసం పెద్దమొత్తంలో రద్దయిన నోట్లను అక్రమ పద్ధతుల్లో కొత్త నోట్ల రూపంలోకి మార్చుకున్నారని గాలిపై ఆరోపణలు వచ్చాయి.
 
ఈ క్రమంలో పట్టుబడిన కర్ణాటక రెవెన్యూ అధికారి భీమానాయక్‌. గాలికి సంబంధించిన పెద్దనోట్లు మార్పిడిలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. దాంతో పెళ్లి ఖర్చు వివరాలను సమగ్రంగా తెలపాలని ఐటీ శాఖ జనార్ధన్‌ రెడ్డికి సూచించింది. పెళ్లికి రూ.30 కోట్లు ఖర్చయిందని, తన భార్య అరుణాలక్ష్మి డైరెక్టర్‌గా ఉన్న ట్యూబుల్‌ రివేట్స్‌ నుంచి నిధుల సమకూర్చినట్లు ఆయన తెలియజేశారు. పెళ్ళికి కావాల్సిన వస్తువులన్నీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు.