ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (14:07 IST)

గోమాతను హోదా చిహ్నంగా భావించి తినేవారిని ఉరితీయాలి : సాధ్వీ సరస్వతి

గోడ్డు మాంస విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన తర్వాత ఈ అంశం దేశ వ్యాప్తగా చర్చ సాగుతూనే ఉంది. ముఖ్యంగా.. పశు మాంస విక్రయాలతోపాటు.. పశువధపై కేంద్రం విధించిన ఆంక్షలపై స్టే విధించాలని సుప్రీంక

గోడ్డు మాంస విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన తర్వాత ఈ అంశం దేశ వ్యాప్తగా చర్చ సాగుతూనే ఉంది. ముఖ్యంగా.. పశు మాంస విక్రయాలతోపాటు.. పశువధపై కేంద్రం విధించిన ఆంక్షలపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటీషన్లు సైతం దాఖలయ్యాయి. వీటిని విచారించిన అపెక్స్ కోర్టు స్టే విధించేందుకు నిరాకరిస్తూనే కేంద్రానికి నోటీసు జారీ చేసింది. 
 
గోవాలోని రామ్ నాతిలో నాలుగు రోజుల అఖిల భారత హిందూ మహాసభ ప్రారంభం సందర్భంగా ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాధ్వి సరస్వతి స్పందిస్తూ... "మా గోమాతను హోదా చిహ్నంగా భావించి తినేవారిని ఉరేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రజలు చూస్తుండగానే వారిని ఉరితీయాలి. గోవుల పరిరక్షణ బాధ్యతను అర్థం చేసుకోవాలి" అని కోరారు.  
 
అదేసమయంలో సతానత్ సంస్థ అధికార ప్రతినిధి అభయ్ వర్తక్ బీజేపీ సర్కారును తప్పుబట్టారు. గోమాతను కాపాడతామంటూ అధికారంలోకి వచ్చిన వారు దాన్ని మర్చిపోయి, ఇప్పుడు రెండు విధాలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 'గోవాలో బీజేపీ గొడ్డు మాంసం ఓ ఆహార అలవాటని చెబుతోంది. మరో రాష్ట్రానికి చెందిన సీఎం తాను గొడ్డు మాంసం తింటానని చెబుతున్నారు. ఒకే జాతి, ఒకే గుర్తు అంటూ బీజేపీ ఒకప్పుడు ప్రచారం చేసేది. నేడు ఒకే పార్టీ రెండు నాల్కలు అన్నట్టుగా మారిపోయింది' అని వర్తక్ విమర్శించారు.