ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (10:50 IST)

కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు.. 66 ఏళ్ల వయస్సులో తల్లైన మహిళ

కుటుంబంలోని తొమ్మిది మంది రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక ఆ వంశానికి వారసుడు అంటూ ఎవ్వరూ లేరు. ఇక లాభం లేదనుకున్న ఓ 66 ఆరేళ్ల మహిళ వారసుడి కోసం తల్లి అయ్యింది. లేటు వయస్సులో టెస్ట్ ట్యూబ్ విధానంలో సంతానం పొందింది. రోడ్డు ప్రమాదంలో కన్నకొడుకు కూడా ప్రాణాలు కోల్పోవడంతో వారసత్వం కోసం పడంటి బాబుకు జన్మనిచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన మధుబెన్ గహ్లెతా, శ్యామ్‌భాయ్ గహ్లెతాలు దంపతులకు చెందిన కుటుంబ సభ్యులు 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కుమార్తె మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మధుబెన్ దంపతులు విషాదంలో మునిగిపోయారు. 
 
చివరికి కుమార్తె సాయంతో టెస్టు ట్యూబ్ బేబీని పొందాలనుకున్న మధుబెన్ దంపతులు విజయవంతంగా లేటు వయసులో తల్లిదండ్రులు అయ్యారు. తొలుత డాక్టర్లు షాక్ అయినా.. తర్వాత వారికి సహకరించి చికిత్స అందించారు. ఫలితంగా మధుబెన్ 66 ఏళ్ల వయస్సు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.