"వీడు మగాడ్రా బుజ్జీ"... తప్పిపోయిన సింహం పిల్లను తల్లి ఒడికి చేర్చిన యువకుడు..
"వీడు నిజంగానే మగాడ్రా బుజ్జీ"... ఈ డైలాగ్ ఓ తెలుగు చిత్రంలోనిది. కానీ, నిజజీవితంలో ఓ యువకుడు ఇలాంటి ప్రశంసలే నెటిజన్ల నుంచి అందుకుంటున్నాడు. తల్లి నుంచి తప్పిపోయి దిక్కుతోచక అల్లాడుతున్న ఓ సింహం పి
"వీడు నిజంగానే మగాడ్రా బుజ్జీ"... ఈ డైలాగ్ ఓ తెలుగు చిత్రంలోనిది. కానీ, నిజజీవితంలో ఓ యువకుడు ఇలాంటి ప్రశంసలే నెటిజన్ల నుంచి అందుకుంటున్నాడు. తల్లి నుంచి తప్పిపోయి దిక్కుతోచక అల్లాడుతున్న ఓ సింహం పిల్లను తిరిగి తల్లి ఒడికి చేర్చిన యువకుడికి అటవీ అధికారులు, గ్రామస్తుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
గుజరాత్ రాష్ట్రంలోని వడోదర సమీపంలో గిర్ అనే అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడకు దగ్గరలో జునా ఉగ్లా అనే గ్రామం ఉంది. పత్తిచేనులో పనిలోకి వెళ్లిన గ్రామానికి చెందిన ఓ యువకుడి కంటికి ఓ సింహం పిల్ల చేనులో తచ్చాడుతూ కనిపించింది. బహుశా అది తల్లి నుంచి తప్పిపోయి ఉంటుందని గుర్తించిన యువకుడు దానిని పట్టుకుని స్నేహితులతో కలిసి దాని తల్లి కోసం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాడు.
అలాగే, చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కలిసి విషయం వివరించారు. సింహం ఆచూకీ కోసం ఆరా తీశారు. అలా దాని కోసం 15 గంటలపాటు గాలించాడు. చివరికి తమ ప్రయత్నంలో విజయం సాధించారు. సింహం పిల్ల తల్లిని గుర్తించారు. దూరం నుంచి దానిని చూసిన యువకులు బోనులో ఉన్న సింహం పిల్లను వదిలి పెట్టడంతో అది ఒక్క పరుగున తల్లి ఒడికి చేరింది. పిల్లను గుర్తించిన తల్లి సింహం దానిని తనతో తీసుకెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు యువకుడిని అభినందించారు.