శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 5 అక్టోబరు 2020 (20:29 IST)

మార్గదర్శక ఉపాధ్యాయులను గుర్తించిన హరప్పా ఎడ్యుకేషన్‌

భారతదేశపు సుప్రసిద్ధ ఆన్‌లైన్‌ అభ్యాస వేదిక హరప్పా ఎడ్యుకేషన్‌, తమ రెండవ దశ డిజిటల్‌ కార్యక్రమం హరప్పా  హ్యాబిట్‌ హీరోస్‌ విజేతలను నేడు వెల్లడించింది. దాదాపు 2వేల నామినేషన్ల నుంచి ఐదుగురు విద్యావేత్తలను ఎంపిక చేశారు. మహమ్మారి విజృంభణ వేళ ఆన్‌లైన్‌ విద్యా రంగంలో గణనీయమైన మార్పులను తీసుకురావడంలో వీరు ఎనలేని కృషి చేశారు.
 
ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, వారి అధ్యాపకులు ఇప్పుడు నూతన మార్గంలో ముందుకు వెళ్లడాన్ని అభ్యసిస్తున్నారు. ఇది అనుకున్నంత సులభమైనది కాదు కానీ, పట్టుదలతో వారు దానిని సాధిస్తున్నారు. విద్యార్థులు నిరంతరం అభ్యసించడంతో పాటుగా వృద్ధి చెందుతున్నారు.
 
తమ రెండవ ఎడిషన్‌ డిజిటల్‌ కార్యక్రమం ద్వారా, హరప్పా ఇప్పుడు వినూత్నమైన బోధనా విధానాన్ని స్వీకరించడంతో పాటుగా సృజనాత్మక బోధనా పద్ధతులను అనుసరించడం ద్వారా విద్యార్థులు మరింత ఉత్తమంగా నేర్చుకునేందుకు సహాయపడుతున్నారు.
 
శ్రేయసీ సింగ్‌, ఫౌండర్‌ అండ్‌ సీఈవో, హరప్పా ఎడ్యుకేషన్‌ మాట్లాడుతూ, ‘‘అభ్యాసాన్ని అందరికీ చేరువ చేయడమనేది హరప్పాకు వెన్నెముకగా ఉంటుంది. మేము చేసే ప్రతి అంశంలోనూ విద్యావేత్తలు, అభ్యాసకులు కీలకంగా ఉంటారు. ఓ సంస్థగా మా నిష్ణాతులు ఏవిధంగా తమ జ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటున్నారనే అంశం పట్ల గర్వంగా ఉన్నాం. మేము విద్యావేత్తలు, పరిశ్రమ నాయకులను మా కోర్సులను బోధించేందుకు ఏకతాటిపైకి తీసుకువచ్చాం. అందువల్ల, మేము ఉపాధ్యాయులను గౌరవించడాన్ని గర్వంగా భావిస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులకు మార్పును సాధ్యం చేయడంతో పాటుగా అంతరాయాలను నేవిగేట్‌ చేయడం,  బోధన మరియు అభ్యాసాల పరంగా నూతన అవకాశాలను నేర్చుకోవడం స్యాధ్యం చేస్తున్నాం’’ అని అన్నారు.
 
హరప్పా యొక్క ఐదుగురు హ్యాబిట్‌ హీరోలను కలుసుకోండి
1. అర్జూ రిఖివా: మా ఉపాధ్యాయులలో అతి పిన్న వయస్కురాలు. ఆరేళ్ల అనుభవం ఈమెకు ఉంది. నోయిడాలోని శివ్‌ నాడార్‌ స్కూల్‌లో గ్రేడ్‌ 3 విద్యార్థులకు బోధిస్తున్నారు. ఆఫ్‌లైన్‌లాగానే ఆన్‌లైన్‌ బోధనను సైతం ప్రభావవంతంగా మలుస్తున్నారు. ఆమె ఆన్‌లైన్‌ తరగతి గదిలో విద్యార్థులు ప్లానింగ్‌, ఎగ్జిక్యూషన్‌ చేయగలరు. తరగతి గదిలో చర్చలు జరుపడంతో పాటుగా అనుసంధానిత సమర్పణలను సైతం చేస్తారు. మరీ ముఖ్యంగా, నూతన పర్యావరణంలో అవసరాలను పునరాలోలించడం ద్వారా అందుకు తగినట్లుగా పరిష్కారాలను అందిస్తున్నారు.
 
2. సునీల్‌ భఖరీ: నాసిక్‌లోని ఏకలవ్య రెసిడెన్షియల్‌ స్కూల్‌లో గిరిజన విద్యార్థులతో పనిచేస్తున్నారు. అక్కడ సాంకేతికత అనేది సులభంగా పొందడం దుర్లభం. గత 25 సంవత్సరాలుగా 6నుంచి 10 గ్రేడ్‌ల విద్యార్థులకు బోధిస్తున్నారు. ఇంటర్నెట్‌ లేని విద్యార్థులు వెనుక బడకూడదనేలక్ష్యంతో తమ టెక్నాలజీ ప్రాప్యతకనుగుణంగా విద్యార్థులను విభిన్న గ్రూప్‌లుగా విభజించి బోధిస్తున్నారు. వాట్సాప్‌ ద్వారా పూర్తిగా ఆన్‌లైన్‌లో బోధించడంతో పాటుగా ఇంటర్నెట్‌ లేకుండా బేసిక్‌ మొబైల్‌ ద్వారా  కూడా బోధన సాగిస్తున్నారు. ప్రెజంటేషన్స్‌, వాయిస్‌ నోట్స్‌, వీడియో క్లిప్స్‌ ద్వారా తనబోధనను సాగిస్తున్నారు.
 
3. అంజలి దద్వాల్‌: గత 23 సంవత్సరాలుగా బోధనా వృత్తిలో ఉన్న ఈమె చండీఘడ్‌లోని భారతీయ విద్యాభవన్‌లో ప్రీస్కాలర్స్‌కు బోధిస్తున్నారు. తన జీవితంలో తొలిసారిగా సాంకేతికత వినియోగించడమే అతి పెద్ద సవాల్‌గా ఆమెకు నిలిచింది. వేగంగానే ఆమె నేర్చుకోవడంతో పాటుగా ప్రీ స్కాలర్స్‌ సాంకేతికత పట్ల అనుసంధానితమై ఉండేందుకు నూతన పద్ధతులనూ కనుగొన్నారు. ఆమె కైనస్థిటిక్‌ అభ్యాస విధానాలను ఉపయోగించి విద్యార్థులకు ఆసక్తి కలిగిస్తున్నారు.
 
4. షిప్రా భారతీయ: గ్రేడ్‌ 4,5 తరగతుల విద్యార్థులకు ప్రైమరీ మ్యాథ్స్‌ టీచర్‌గా నోయిడాలోని శివ్‌ నాడార్‌ స్కూల్‌లో చేస్తున్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా బోధనా వృత్తిలో ఉన్న ఆమె, తమ విద్యార్థులకు ఆసక్తి కలిగేలా బోధన సాగించడాన్ని సవాల్‌గా స్వీకరించారు. అతి సరళమైన ఆలోచనలను మిళితం చేయడంతో పాటుగా ప్రతి పాఠం తరువాత విద్యార్థుల అభిప్రాయాలను తీసుకుంటుంటారు. వారు ఏ విధంగా తమ హోమ్‌ వర్క్‌ పూరించాలో వారినే నిర్ణయించుకోమని తెలుపడంతో పాటుగా పీర్‌ లెర్నింగ్‌ను ప్రోత్సహిస్తారు.
 
5. నిషా జైన్‌ గ్రోవర్‌: జైపూర్‌కు చెందిన సైకాలజిస్ట్‌, కౌన్సిలర్‌. ప్రవర్తన, అభ్యాస వైకల్యం కలిగిన చిన్నారులతో ఆమె గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వత్సాలయ లెగసీ ప్రీస్కూల్‌లోని తన బంధంతో ఆమె తనకెదురైన సవాళ్లను అధిగమించి చిన్నారులు నేర్చుకునేందుకు తోడ్పడుతున్నారు. ప్రతి రోజూ వాట్సాప్‌ ద్వారా ముఖాముఖి సంభాషిస్తుండటంతో పాటుగా తమ విద్యార్థులను నూతన సంగీతం, నృత్యం, యోగా తరగతులకు పరిచయం చేశారు. విద్యార్థులు సౌకర్యవంతంగా భావించిన తరువాత మాత్రమే వారికి విద్యాంశాలను నెమ్మదిగా చెప్పడం ఆరంభిస్తారు.
 
హరప్పా హ్యాబిట్‌ హీరోలకు 25 హరప్పా కోర్సులను కాంప్లిమెంటరీగా పొందే అవకాశం అందిస్తారు. వారి స్ఫూర్తిదాయక వీడియో కథలను హరప్పా డిజిటల్‌ ఛానెల్స్‌పై పంచుకుంటారు. మరింత మంది టీచర్ల ప్రయత్నాలను గుర్తించడంలో భాగంగా 10 మంది నామినీలకు 50% రాయితీని, 25 మంది నామినీలకు 30% రాయితీని తామెంచుకున్న హరప్పా కోర్సులపై పొందే అవకాశమందిస్తారు.