ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (11:55 IST)

శభాష్ అనిపించుకున్న హర్యానా బీజేపీ నేత.. కట్నంగా ఒక్క రూపాయి

marriage
హర్యానా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కృష్ణ చౌకర్‌ శభాష్ అనిపించుకున్నారు. వరకట్నంగా రూపాయి మాత్రమే తీసుకుని కుమారుడి వివాహం జరిపించారు. సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోన్న చౌకర్ కుమారుడు గౌరవ్‌కు హర్యానా రాష్ట్ర స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఛైర్మన్‌ భూపాల్‌ సింగ్‌ ఖాద్రీ కుమార్తె గరిమాతో వివాహం జరిపించారు. 
 
కట్నంగా వధువు తరపు వారు ఏడు లక్షలకు పైగా వరకట్నం ఇచ్చారు. అయితే ఆ మొత్తాన్ని చౌకర్ సున్నితంగా నిరాకరించారు. సంచిలో నుంచి రూపాయి మాత్రమే తీసుకుని, మిగిలింది వెనక్కి ఇచ్చేశారు. దీంతో అతిథులంతా ఆయనపై ప్రశంసలు కురిపించారు. 
 
ఈ సందర్భంగా కృష్ణ చౌకర్‌ మాట్లాడుతూ.. వరకట్నం సమాజానికి శాపమని అన్నారు. ఇక, తన కుమార్తెకు కట్నంగా ఇచ్చిన సొమ్మును వరుడి కుటుంబం నిరాకరించడంతో వధువు తండ్రి ఆ మొత్తాన్ని ఓ మహిళా కాలేజీకి విరాళంగా అందజేయడం విశేషం.