సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2023 (16:29 IST)

ఆస్పత్రిలో చేరిన హెచ్‌డీ కుమారస్వామి..

kumaraswamy
జేడీఎస్​ నాయకులు హెచ్​డీ కుమారస్వామి ఆస్పత్రిలో చేరారు. బుధవారం ఉదయం అనారోగ్యం కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్లు సన్నిహితులు తెలిపారు. అలసట, జ్వరంతో బాధపడిన ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. బెంగళూరులోని జయనగర్.. అపోలో స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. 
 
కుమార స్వామి ఆరోగ్య పరిస్థితిపై సదరు ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే కుమార స్వామికి మేజర్ హార్ట్ సర్జరీ జరిగింది. 
 
అనంతరం ఇలా అనారోగ్యం బారిన పడటం వల్ల కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్జరీకి, ఇప్పటి ఆరోగ్య పరిస్థితికి ఎలాంటి సంబంధం లేదని వైద్యులు నిర్ధారించారు.